నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి :
బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా నల్గొండలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా యువతలో సేవా భావాన్ని, సామాజిక బాధ్యతను చాటిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజాసేవకు మరింత బలం చేకూరాలని ఆకాంక్షిస్తూ యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. నాగం వర్షిత్ రెడ్డి, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్, సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ నూకల నారాయణరెడ్డి, బీజేపీ నల్గొండ జనరల్ సెక్రటరీ పోతపాక లింగస్వామి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేష్, పిండి పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు.
అలాగే ఎంకన్న, మంగళపల్లి కిషన్, తిరందాసు కనకయ్య, దాసరి వెంకన్న, మాధగోని ఏడుకొండలు, మల్లేపల్లి శ్రీధర్, అదిమల్ల దేవేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేవైఎం నాయకులు అక్కరపల్లి సైదులు, దుబ్బాక సాయి, దావనూరు అజయ్, బత్తిని నాగరాజు, రమేష్ గౌడ్, సాయికారంపూడి సాయి, కార్తీక్, సిలివేరు నాగరాజు, దుబ్బాక నవీన్ రెడ్డి, కానుకల శంకర్ రెడ్డి, శివ, సంతోష్ తదితరులు రక్తదాన శిబిరం నిర్వహణలో పాల్గొన్నారు.
యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొని, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్వాహకులు కోరారు.


