కోటలో ఘనంగా ప్రపంచ శాంతి దినోత్సవం.. శాంతి సందేశంతో విద్యార్థుల ర్యాలీ

నవపక్షం, గూడూరు ప్రతినిధి :

కోట మండలం కోటలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యానగర్ లోని ఫోనిక్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు శాంతి ర్యాలీ నిర్వహించారు.మండల కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు శాంతి,సోదరభావం, సహనానికి సంబంధించిన సందేశాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలో పయనించాలని, యుద్ధాలు,హింసకు తావులేకుండా పరస్పర స్నేహభావం,సహనం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన, సురక్షితమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

అనంతరం కోట పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ప్రపంచ శాంతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఏఎస్ఐ చేతుల మీదుగా శాంతి కపోతాన్ని విడుదల చేసి శాంతి సందేశాన్ని చాటారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది విద్యార్థులకు శాంతి, సోదరభావం, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.