నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ గురువారం నాంపల్లిలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షురాలు నక్క యాదమ్మ సహకార పతాకాన్ని ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించారు. నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంఘం మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ నక్క రవీందర్ సభను ప్రారంభించి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి సభ్యుల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
సభలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. కొత్త సభ్యత్వాలను ప్రోత్సహించి, అర్హులైన సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు.
కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు నక్క చంద్రమౌళి, కర్నాటి జయ ప్రకాష్, సంగెపు పరంధాములు, పున్న కోటేశ్వర్, కర్నాటి నాగరాజు, కోట అయోధ్య, కర్నాటి శ్రీహరి, సంఘం మేనేజర్ పిల్లలమర్రి రంగయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, ఉపాధ్యక్షుడు గంజి సంజీవ, కోశాధికారి రుద్ర వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు గుర్రం శ్రీరాములు, గుర్రం భిక్షమయ్య, కర్నాటి విజయ్, వింజమూరి సురేందర్‌తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.


