నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24:
గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహదాత నారక్కపేట ఉపసర్పంచ్ మమతా రాంబాబు దంపతులను మూడో వార్డు యూత్ సభ్యులు, మహిళా మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తుల జయజయధ్వానాల మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళా మండలి సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


