నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది:
జిల్లా బహిష్కరణ అస్త్రం ప్రయోగించే దిశగా ఎస్పీ నరసింహా కీలక ఆలోచన చేస్తున్నారు. పోకిరీలు, రౌడీషీటర్లు, నేరగాళ్లకు పోలీస్ పవర్ చూపించేందుకు ఎస్పీ మాస్టర్ ప్లాన్ పక్కా ప్రణాళికతో నేరాలకు స్వస్తి పలికేందుకు శ్రీకారం.. పీడీ యాక్ట్ ల ద్వారా నేరగాళ్లకు చట్టం అంటే ఏమిటో చూపించేలా కఠిన కార్యాచరణ అమలు చేసే దిశగా అడుగులు వేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో ఏ మూలన నేరం జరిగినా నేరస్తులకు తప్పించుకునే మార్గాలు లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట నిఘా నేర పరిశోధనలో సరికొత్త వ్యూహాలు ఈ దీపావళి నుంచి రౌడీషీటర్లు, నేరగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోలీసుల ఉక్కుపాదం మోపనున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా చట్ట పరిధిలో అత్యంత కఠిన చర్యలకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమని స్పష్టం చేసిన ఎస్పీ నరసింహ.


