నవపక్షం, గోరి కొత్తపల్లి , సెప్టెంబర్ 11:
గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, గండ్ర వెంకట రమణారెడ్డి శుక్రవారం పరామర్శించారు, గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన మన తెలంగాణ రిపోర్టర్ బత్తుల వెంకటేష్ తల్లి బత్తుల శాంతమ్మ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు
అదేవిధంగా కోనరావుపేట గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ రొడ్డ కిరణ్ కుమార్ తండ్రి రొడ్డ పెద్ద లింగయ్య మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమాల్లో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు హమీద్ , అదేవిధంగా పలు గ్రామాలకు చెందిన సర్పంచులు నిమ్మల శంకర్ ,జవాజి రమేష్ ,ఉప సర్పంచులు మార్క కమలాకర్ ,పున్నం రాజు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ కార్య కర్తలు, అమ్ములు రాజయ్య ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


