అక్రమంగా తరలిస్తున్న 324 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

నవపక్షం, యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి :

జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వలు మరియు దుర్వినియోగంపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు రాజపేట పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రాజపేట మండలం సింగారం గ్రామం వద్ద పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానించిన లారీని అదుపులోకి తీసుకున్నారు.

లారీని తనిఖీ చేయగా అందులో 324 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో, సదరు పిడిఎస్ బియ్యాన్ని పుట్టగూడెం గ్రామానికి చెందిన భూక్యా దేవి సింగ్ సహాయంతో సిద్దిపేట వైపు తరలిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారానికి సంబంధించి రాజపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పిడిఎస్ బియ్యం మూలం, అక్రమ రవాణా ఉద్దేశ్యం, సంబంధిత వ్యక్తుల పాత్రతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర అంశాలపై చట్ట ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కేసులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తుల వివరాలు

  1. భూక్యా దేవి సింగ్, తండ్రి: కిషన్,
    నివాసం: పుట్టగూడెం గ్రామం, రాజపేట మండలం.
  2. కటార ఆవడ బాలు,
    నివాసం: గుజరాత్ రాష్ట్రం.
  3. మోరీ సమీర్ జేత,
    నివాసం: గుజరాత్ రాష్ట్రం.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

  • 324 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం
  • లారీ – రిజిస్ట్రేషన్ నం. GJ-37-V-8666

ఈ సందర్భంగా రాజపేట ఎస్‌ఐ మాట్లాడుతూ, పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా దుర్వినియోగం చేయడం వంటి చర్యలను జిల్లా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వలు మరియు దుర్వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ సంబంధిత శాఖల సమన్వయంతో నిరంతర తనిఖీలు మరియు నిఘా కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.