దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-
భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వడ్లగూడెం గ్రామానికి చెందిన కుంజా వెంకటేశ్వరరావు కు అతని భార్య గంగాభవానికి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు. ఈ క్రమంలో గత రెండేళ్లగా ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. భార్యను కాపురానికి రావాలని కోరినప్పటికీ ఆమె నిరాకరించటంతో వెంకటేశ్వర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐరన్ రాడ్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.


