ఇండియన్ ఆయిల్ సంస్థ ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా 10 కిలోల తేలికపాటి కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసిన మూడు గంటల్లోనే వినియోగదారుల ఇంటి వద్దకు డెలివరీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ కాంపోజిట్ సిలిండర్‌కు పారదర్శక బాడీ ఉండటంతో సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ స్థాయిని వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇది తేలికగా ఉండటంతో పాటు తుప్పు పట్టని విధంగా రూపొందించబడింది.
వినియోగదారులు IndianOil ONE యాప్, వెబ్‌సైట్ లేదా వాట్సాప్ నంబర్ 7588888824 ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
పట్టణ ప్రాంతాల్లోని గృహాలు, ఉద్యోగ నిపుణులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను రూపొందించినట్లు ఇండియన్ ఆయిల్ సంస్థ వెల్లడించింది. వేగవంతమైన డెలివరీతో పాటు తేలికైన సిలిండర్, గ్యాస్ స్థాయిని సులభంగా గుర్తించే సౌకర్యం వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించనుంది.






