నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద ఓ డీసీఎం వాహనం రోడ్డు దాటుతున్న సమయంలో విజయవాడ వైపు నుంచి బుల్లెట్‌పై వచ్చిన వ్యక్తి డీసీఎంను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బుల్లెట్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాల కదలికలు తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Hot this week

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు

నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

గురజాలలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం 120 మందికి కంటి పరీక్షలు.. 15 మందికి ఉచిత ఆపరేషన్లు

నవపక్షం, ఆగస్టు 9, శాలిగౌరారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి...

Topics

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు

నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.