మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల నమోదిత మత్స్యకారులు అర్హులని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి బీమా ప్రీమియం రూ.79.96 కాగా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియాన్ని భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21.34 కోట్లకు పైగా చెల్లించనుండటంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.

బీమా పథకం ప్రయోజనాలు

  • ప్రమాదవశాత్తు మరణం: రూ.5 లక్షలు
  • శాశ్వత సంపూర్ణ వైకల్యం: రూ.5 లక్షలు
  • శాశ్వత పాక్షిక వైకల్యం: రూ.2.50 లక్షలు
  • ప్రమాదవశాత్తు ఆసుపత్రి చికిత్స: గరిష్ఠంగా రూ.25 వేల వరకు

ఈ పాలసీ 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ అవసరమైన చర్యలు చేపడుతోందని వెల్లడించారు.

ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడం, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.