నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నారాయణపేట శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నారాయణపేట చౌక్ బజార్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ మంజుల హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ప్రతిరోజూ స్మరించుకుంటూ, వారి ఆశయాలు, అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.
ప్రతి యువకుడిలో జాతీయ భావాలను పెంపొందించుకుని దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని కోరారు. దేశ సమగ్ర అభివృద్ధి కోసం విద్యార్థులు, యువత ముందుండి పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ, ఇంతియాజ్, చరణ్ రెడ్డి, రోహిత్, తరుణ్, మణి, యశ్వంత్, చరణ్, సంతోష్, రవి, నితిన్ తదితర ఏబీవీపీ నాయకులు, కళాశాల కార్యకర్తలు, విద్యార్థులు, నారాయణపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


