అంగన్వాడి కేంద్రాలు శాశ్వత భవనాలు ఉండాలని డిమాండ్

దమ్మపేట – నవ పక్షం

అంగన్వాడి కేంద్రాలు ప్రజల నివసించే ప్రాంతాల్లో కొనసాగుతున్నందువల్లనే గర్భిణీలు బాలింతలు పసిపిల్లలకు పౌష్టికాహారం అందించబడుతుందని పేదలకు అనుకూలమైన ప్రాంతాలను వదిలి ప్రైవేట్ అద్దె భవనాల్లో అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయన్న నెపంతో దూర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు తరలించరాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. గురువారం అంగన్వాడి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐసిడిఎస్ సిడిపిఓ హేమసత్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ పేద ప్రజలకు సరైన పౌష్టికాహారం అందించాలని అనే లక్ష్యంతో ఐసిడిఎస్ ఏర్పడిందని అన్నారు. కానీ మండలంలో అన్ని గ్రామాల్లో అంగన్వాడి సెంటర్స్ కు శాశ్వత భవనాలు లేవని సగం పైగాఅద్దె భవనాల్లోనే అంగన్వాడి సెంటర్స్ నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానం లో భాగంగానే అద్దభవనాల్లో నడిచే సెంటర్లకు శాశ్వత భవనాలు నిర్మించకుండా ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం నుండిసర్కులర్ జారీచేయడం అన్యాయమని అన్నారు. ఇప్పటికే పౌష్టికాహారంతో ఇబ్బంది పడుతున్న పేదలకు సెంటర్లను ఊర్లో చివరికి తరలిస్తే పిల్లలకు అనుకూలమైన మంచి అభ్యసన వాతావరణం కల్పించడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. ప్రైవేట్ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు సంవత్సరం నుండి సెంటర్ అద్దెలు ప్రభుత్వం విడుదల చేయలేదని వెంటనే సెంటరు అద్దెలు, గ్యాస్ బిల్లులు, కూరగాయలు బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు జ్యోతి , జయ గౌసియా తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.