- భువనగిరి పట్టణంలో జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుక ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా భక్తి గీతాలు శాంతి సందేశాన్ని అందిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది . ఈ ర్యాలీ జలీల్ పుర మసీదు నుండి ప్రారంభమై సమద్ చౌరస్తా, కుమ్మరి వాడ,నల్గొండ రోడ్డు మీదుగా అంబేద్కర్ చౌరస్తా నుండి జలీల్ పుర వరకు కొనసాగింది . ర్యాలీలో చిన్న పిల్లల తో సహా వృద్ధులు పాల్గొని నారే తక్ బీర్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రిన్స్ కార్నర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన సభ ప్రాంగణం లో ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రహీం అడ్వకేట్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవేస్ చిస్తీ,మస్జీద్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచ మానవులకి శాంతి సందేశాన్ని ఇచ్చారని, ఇస్లాం అనేది శాంతి అని అ నాడు మొహమ్మద్ ప్రవక్త చెప్పారని ఇస్లాం మతం కాదని శాంతి సందేశం అని వారు ఈ సందర్భంగా అన్నారు. ప్రతి పౌరుడు శాంతి ద్వారా మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని మహమ్మద్ ప్రవక్త సూత్రాలను ప్రతి పౌరుడు పాటించాలని ప్రవక్త సన్మార్గంలో నడవాలని ప్రపంచ మానవులకి మహమ్మద్ ప్రవక్త ఆదర్శమని అన్నారు. యువత వారి అడుగుజాడల్లో ప్రయాణించాలని వారు కోరారు. ఈ రోజుల్లో మానవనియత విలువలు కనుమరుగు అయీంది అని. మానవ విలువలను కాపాడి ప్రపంచ శాంతికి తోడ్పాటు అందించే విధంగా అందరూ జీవించాలని వారు కోరారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారి నుండి ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినందుకు టౌన్ సిఐ రమేష్ ని మరియు ఇతర పోలీసు అధికారులను సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుర్హాన్, బట్టు రామచంద్రయ్య,గౌరవాధ్యక్షుడు ముష్టక్ చౌదరి, ఉపాధ్యక్షుడు ముస్తఫా ఖాద్రి, షకీల్, కార్యదర్శి కాజం అహ్మద్, జాయింట్ సెక్రెటరీ ఇక్బాల్ అహ్మద్, గఫర్ చౌదరి, సాదిక్ అలీ,సలవుద్దీన్, అమీరుద్దీన్, కోశాధికారి రహీముద్దీన్, ఉస్మాన్,షానూర్ బాబా, ఇంతియాజ్,సుజావద్దీన్, ఫహీం, గౌస్, టూఫీక్, ఖాదర్, సైఫులహా, అఫ్రోజ్, ఇల్యాస్,సమీర్, జలీల్, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలో ఘనంగా మీలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగ జరుపుకున్నారు
Popular Categories


