నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
చిమ్మిర్యాల గ్రామంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ కు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు కేవలం వర్షాధార పంటలే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గమే అత్యంత వెనుకబడిన ప్రాంతం
శివన్న గూడెం రిజర్వాయర్ లోకి నీరు ఎక్కడినుంచి తీసుకురావాలనేది గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం డిసైడ్ చేయలేకపోయింది ఏదుల రిజర్వాయర్ నుండి శివన్నగూడెం రిజర్వాయర్ కు నీరు తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం కరువు పరిస్థితులు ఉన్నాయి వచ్చే వేసవి వరకు త్రాగునీటికి కూడా కటకటా ఏర్పడే పరిస్థితి ఉంది వాటిని అధిగమించడానికి ఇప్పటినుండి అప్రమత్తంగా ఉండాలి కరెంటు సప్లై లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి పుట్టపాక వద్ద 132కెవి సబ్స్టేషన్ తొందరలోనే రాబోతుంది నాంపల్లి మండలంలో మరొక 132 కెవి సబ్ స్టేషన్ తొందర్లోనే రాబోతుంది కరెంటు సమస్యలు తలెత్తకుండా ఎక్కువ సబ్స్టేషన్లు మంజూరు చేయించి నిర్మించుకుంటున్నాం
నియోజకవర్గంలో కరెంటు సమస్యల పరిష్కారానికి, నూతన సబ్ స్టేషన్ల మంజూరు, నూతన ట్రాన్స్ఫార్మర్లు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి విద్యుత్ శాఖలో అనుభవం ఉన్న రిటైర్ అయిన వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాను ఎల్ నినో ప్రభావం వల్ల హైడల్ పవర్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి
ప్రకృతి వైపరీత్యాలను అందరూ అర్థం చేసుకోవాలి కరెంటు సమస్యలపై ప్రతిరోజు ఆశాఖ రాష్ట్రఉన్నతాధికారులతో మాట్లాడుతున్న రైతులకు ఇబ్బందులు కలగకుండా కాపాడుకుంటాము

