ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా బోనాల సంబరాలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 09: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, కొత్తపేట, నాగోల్ డివిజన్లలో బోనాల పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పలు అమ్మవారి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

అనంతరం మన్సూరాబాద్ డివిజన్ యువ నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు అమ్మవారి ఆలయాలను ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అలాగే కొత్తపేట డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగోల్ డివిజన్‌లోని గ్రీన్ టెర్రస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ జిట్ట రాజశేఖర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీశ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు లగ్గొని శ్రీధర్ గౌడ్, నర్రి వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు

నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

గురజాలలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం 120 మందికి కంటి పరీక్షలు.. 15 మందికి ఉచిత ఆపరేషన్లు

నవపక్షం, ఆగస్టు 9, శాలిగౌరారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి...

Topics

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...

నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు

నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.