నవపక్షం, మునుగోడు ప్రతినిధి : శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వచ్చిన కళ్లద్దాలను 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్ ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఊడుగు వెంకటేశం గౌడ్ తో కలిసి వార్డులోని ప్రజలకు వారి ఇళ్ల వద్దే కళ్లద్దాలను అందజేశారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు అందించడం అభినందనీయమని కౌన్సిలర్ హన్ను బాయ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి, వారి ఆరోగ్యం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.






