నవపక్షం, కేసముద్రం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల నూతన ప్రెసిడెంట్ గా నియమితులైన చిలువేరు సమ్మయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్మన్ రామా నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ సునీత వెంకన్న, సీనియర్ నాయకులు, ఎంపీటీసీ, సర్పంచ్ బండారు సుజాత దయాకర్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూగులోతు దస్రు నాయక్, జిల్లా స్పోక్స్‌పర్సన్ అంబటి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బండారు పద్మ, మాజీ PACS చైర్మన్ బండారు వెంకన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీలం సుహాసిని–దుర్గేష్ తదితరులను సమ్మయ్య గౌడ్ కలిసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల పార్టీ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు తీసుకుంటూ, వారి అనుభవాన్ని గౌరవిస్తూ అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానని అన్నారు.
కేసముద్రం మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేస్తూ పార్టీకి మరింత బలమైన పునాది వేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటూ ముందుకు సాగుతానని, కేసముద్రం మండలంతో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సమ్మయ్య గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సమ్మయ్య గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.






