*ఆలేరు మున్సిపల్ మడిగ కబ్జాపై ప్రజావాణి లో కలెక్టర్‌కు ఫిర్యాదు*
ఆలేరు పట్టణంలోని రంగనాయకుల గుడి ముందు ఉన్న 5-5 గల ఇంటి నంబర్‌కు సంబంధించిన మున్సిపల్ మడిగను, ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కట్టెగొమ్ముల విద్యాసాగర్ రెడ్డి కబ్జా చేశారని, ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది.
అలాగే, గత 60 సంవత్సరాలుగా ఈ మడిగలో నివసిస్తూ/వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఘనగాని ఐలయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, మున్సిపల్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, కబ్జా జరిగినట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ ఆస్తిని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
*60 ఏళ్లుగా జీవనం సాగించిన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది.*
-
ఇట్లు
*గణగాని సంపత్ కుమార్ గౌడ్*
*ఆలేరు*
