నవపక్షం, ఎల్బీనగర్, ఆగస్టు 17:
తొలివార్త దినపత్రిక ఎడిటర్ రింగాల నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం కాంప్లెక్స్ సముదాయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు లింగాల నరేందర్ గౌడ్‌ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం లింగాల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు చూపించిన ఆదరాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలిపారు. స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తన మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై లింగాల నరేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నల్లి రమేష్, ‘నేటి దర్శిని’ దినపత్రిక ఎడిటర్ కట్టా సత్యనారాయణ, నవపక్షం దిన పత్రిక ఎడిటర్ గోపి, రాచకొండ కృష్ణమోహన్, ఎం. సంతోష్ రెడ్డి, గార్లపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


