కార్మికుల సమస్యల కోసం AITUC సమరశీల పోరాటాలు :M L C నెల్లికంటి సత్యం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజిలేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.శుక్రవారం భువనగిరి సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఏఐటీయూసీ యాదాద్రి భువన గిరి జిల్లా 3 వ మహాసభ లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం ఏఐటియుసి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ ,వంట గ్యాస్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులుగా పేదవారు మరింత పేదవారిగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక లోకం కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్* మాట్లాడుతూ భారతదేశంలో 1920 అక్టోబర్ 31 ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని అన్నారు .స్వాతంత్రానికి పూర్వమే కార్మిక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రామిక వివాధాల చట్టం ,కనీస వేతన చట్టం, సాధించుకోవడం జరిగింది . బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయుటకు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో కార్మిక వర్గాన్ని సంఘటితము చేసి సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా స్వతంత్ర సాధనే ద్యేయంగా విరోచిత పోరాటాలు చేసిన గొప్ప కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. సామ్రాజ్యం వాద పెట్టుబడిదారుల చేతుల్లో నలిగిపోయిన కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన అనేక ఉద్యమాల ద్వారా కార్మిక చట్టాలను హక్కులను సాధించిన ఏకైక సంఘం AITUC పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మికుల్ని బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. పని గంటల పెంచి కార్మికుల శ్రమ దోపిడికి పాల్పడే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు మారుస్తుందని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల అవుతున్న నేటికీ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికుల ,జీవితాలు మారలేదు కనీస వేతనం లేక PF,ESI,అమలు నోచుకోక శ్రమదోపిడికి గురవుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందనీ అన్నారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్దం కావాలని కోరారు. ఉపాధి హామీ పథకం నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు.ఈ మహాసభలో *ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, బండారపు వెంకటేశ్ సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి బోలగాని సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్ల కార్యదర్శి ఎండి ఇమ్రాన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళెం కృష్ణ, చెక్క వెంకటేశ్,జిల్లా నాయకులు జి వెంకటేష్, పిల్లి శంకర్, బి మల్లేష్, ఇంజా హేమలత,ఎస్ సబిత,సామల శోబన్ బాబు , సామల భాస్కర్ ముంతాజ్ బేగం, చిలివేరు అంజయ్య, పల్లె శ్రీనివాస్ పుట్ట రమేష్, బి నరసింహ,ch మల్లేష్, లక్మి,నిర్మల, జగన్, కృష్ణ, కుమార్,* తదితరులు పాల్గొన్నారు.

 

Hot this week

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Topics

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.