నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22A) పేరుతో పేదలు, రైతులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మహా దీక్ష” కు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి లోపాలను సరిదిద్దుతామని చెప్పి, లక్షలాది ఎకరాల పట్టా భూములను ఏకపక్షంగా 22A నిషేధిత జాబితాలో చేర్చింది. దీనివల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి, అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక రైతులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వేలాది మంది రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణ రెడ్డి, ఏలే చంద్ర శేఖర్, తుమ్మల మురళీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చందా మహేందర్ గుప్తా, కదూరి అచ్చయ్య, జిల్లా కార్యదర్శి తడిసిన మల్ల రెడ్డి,జిల్లా కోశాధికారి సోమనర్సయ్య, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహా రావు, జిల్లా it సెల్ కన్వీనర్ వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ రేణుక, ఉదయ్, మండల అధ్యక్షులు ch సురేష్ రెడ్డి, భువనగిరి సాధనంద్ గౌడ్, బొల్లు సుదర్శన్, బీజేవైఎం నాయకులు పవన్ సంతోష్, మధు, శ్రీకాంత్ మరియు జిల్లాలోని మండలాల అధ్యక్షులు, కిసాన్ మోర్చా, యువమోర్చా ప్రతినిధులు, బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు


