పామాయిల్ గెలల దొంగతనాల నివారణకు పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.

దమ్మపేట, నవపక్షం ప్రతినిధి:-

దమ్మపేట మండలం పరిధిలో ఇటీవల జరిగిన పామాయిల్ గెలల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు రైతులు, పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మరియు కలెక్షన్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి మరియు దమ్మపేట ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దమ్మపేట మరియు అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల యాజమాన్య ప్రతినిధులు, పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్ పాల్గొన్నారు. పామాయిల్ గెలల దొంగతనాలను అరికట్టడంతో పాటు రైతుల పంటకు భద్రత కల్పించేందుకు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

. ప్రతి రైతు F-Code పై తగిన పరిమితిని విధించి, దాని దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి.

. పామాయిల్ గెలల రవాణా జరిగే ప్రధాన కూడళ్ల వద్ద సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలి.

. రైతులు తమ పామాయిల్ పంటను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలను గమనించాలి.

. పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తరలించేందుకు నమ్మకమైన డ్రైవర్లను మాత్రమే నియమించుకుని, పంటను సురక్షితంగా ఫ్యాక్టరీకి తరలించాలి.

. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా పామాయిల్ గెలల లోడింగ్ లేదా అన్‌లోడింగ్ జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

. రైతులు తమ F-Code వివరాలను ఇతర వ్యక్తులతో షేర్ చేయకూడదు. F-Code దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, పామాయిల్ గెలల దొంగతనాలను అరికట్టేందుకు రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్షన్ ఏజెంట్లు మరియు డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ సమావేశంలో టీజీ ఆయిల్ ఫీల్డ్ తరఫున నాగబాబు, వెంకటేష్, శంకర్, కార్తీక్ మరియు పాకలగూడెం పామాయిల్ గెలల కలెక్షన్ ఏజెంట్ పద్మరాజు పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.