వినూత్న బోధనా విధానాలకు గుర్తింపు — వల్లాల ఆదర్శ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడికి ITA–2026 అవార్డు

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : 

విద్యారంగంలో వినూత్న బోధనా విధానాలను అవలంబిస్తూ, తెలుగు భాషాభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తున్న తెలంగాణ ఆదర్శ పాఠశాల, వల్లాల (శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా) తెలుగు ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు ప్రతిష్ఠాత్మక INNOVATION TEACHER AWARDS–ITA 2026 అవార్డును అందుకున్నారు.

హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ వేదికగా జఠాధర ఎడ్యుకేషన్ టెక్నాలజీ (JET) యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన INNOVATION TEACHER AWARDS–ITA 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్య అతిథి, తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, తెలంగాణ మోడల్ స్కూల్స్ AMO మంజరీ చేతుల మీదుగా కుక్కడపు శ్రీనివాసు ఈ అవార్డును స్వీకరించారు.

తెలుగు భాషా బోధనలో సృజనాత్మక పద్ధతుల వినియోగం, సాంకేతికతను సమర్థవంతంగా అనుసంధానం చేయడం, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడం, పాఠశాల స్థాయిలో చేపట్టిన వినూత్న విద్యా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

కుక్కడపు శ్రీనివాసు సాధించిన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం పట్ల వల్లాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, విద్యారంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఈ అవార్డు ఉపాధ్యాయుల సృజనాత్మకతకు, వినూత్న బోధనా విధానాలకు లభించిన గుర్తింపుగా నిలవడంతో పాటు, విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.