నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకలకు మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ హాజరై భద్రరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భద్రరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన కొత్త లక్ష్మి రవి గౌడ్, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.
ఈ జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని భద్రరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు


