నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :
నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ గారి తండ్రి గారు పరమపదించిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆయన స్వగ్రామమైన కాకులకొండారం గ్రామానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, బాకీ నరసింహ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరికంటి మొగులయ్య, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, చిట్యాల బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


