ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించాలి – రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు

నవపక్షం, బాన్సువాడ ప్రతినిధి :

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కోరారు.

వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించనున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి బాన్సువాడ పట్టణంలో పాత బాన్సువాడ చావిడి నుంచి కల్కి చెరువు వరకు నిమజ్జన రూట్‌ను జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి కాసుల బాలరాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, విద్యుత్ సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారి నిర్వహణ, నిమజ్జన ప్రదేశంలో భద్రతా చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.

కాసుల బాలరాజు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కోరారు.

నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గంగాధర్, కృష్ణారెడ్డి, మాసాని శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ ఖలేఖ్, గోపాల్ రెడ్డి, వెంకన్న, శివదయాళ్, ఎజాస్, వాహబ్, లింగమేశ్వర్ తదితరులతో పాటు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.