గౌడ్ అన్నల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, పరకాల

నవపక్షం, పరకాల నియోజకవర్గం ప్రతినిధి : నడికుడ మండలం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న బస్సు యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నడికుడ మండలంలోని రాయపర్తి, పులిగిల్ల, చర్లపల్లి, నార్లాపూర్, వరికోల్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.

కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో, ఆయా గ్రామాల గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు మార్క బాబన్న, పాలకుర్తి శంకర్ గౌడ్, తాళ్లపల్లి సతీష్, బోనగాని సంతోష్, పోశాల రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ గౌడ్ ఆధ్వర్యంలో చేపడుతున్న బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, గౌడ సొసైటీలకు ప్రతి గ్రామంలో కనీసం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని, ఆ భూముల్లో తాటి, ఈత వనాలను పెంచుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే కల్లుగీత కార్మికులకు పెన్షన్లు, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, మోటార్ వాహనాలు అందించాలని, పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దబోయిన రవీందర్కు కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు బండి సదానందం గౌడ్, మార్క రఘుపతి గౌడ్, పోశాల సమ్మయ్య, పరకాల మండల ప్రధాన కార్యదర్శి గునిగంటి బుచ్చి రాములు, మండల ఉపాధ్యక్షులు శ్రీధర్తో పాటు ఆయా గ్రామాలకు చెందిన కల్లుగీత కార్మికులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.