ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

నవపక్షం, నెల్లిమర్ల ప్రతినిధి:

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడమే లక్ష్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముంజేరు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
రెవెన్యూ, ఇళ్ల స్థలాలు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి ప్రజలు సమర్పించిన వినతులను ఎమ్మెల్యే శ్రద్ధగా విని, సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. పలువురు అర్జీదారుల సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి, ప్రాధాన్యత క్రమంలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వినడమే కాదు.. వాటికి పరిష్కారం చూపించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తూ, ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తాను” అని తెలిపారు.
చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశ, పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం కోసం అధికార యంత్రాంగాన్ని కదిలిస్తున్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Hot this week

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.