కొత్తగూడెం, నవ పక్షం, జిల్లా ప్రతినిధి :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా NSUI అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి నియమితులైన సందర్భంగా అజ్మీర సురేష్ కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో TPCC సభ్యులు జెబి శౌరి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జె.బి శౌరి గారు మరియు జిల్లా సెక్రటరీ ఎం.డి. గౌస్ మొహినుద్దీన్ గారు అజ్మీర సురేష్‌ను శాలువాతో సత్కరించి, వరుసగా రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం NSUI ఆధ్వర్యంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అజ్మీర సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి వరుసగా రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, NSUI నాయకులకు, కార్యకర్తలకు మరియు తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ, NSUIని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాము రాము, యువజన నాయకులు ఉర్సు శివ, షేక్ హమీద్, షేక్ అజహర్,NSUI నాయకులు బానోత్ శ్రీధర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు..


