కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలు

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి :

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.

నల్గొండ జిల్లాకు రావాల్సిన సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతోందని, ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లింగయ్య ఆరోపించారు. పంటలు ఎండిపోకుండా AMRP పరిధిలోని చెరువులు, కుంటలను వెంటనే నీటితో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, దళితులపై పోలీసు కేసుల విషయంలో రాజకీయ జోక్యం ఉందని ఆయన ఆరోపించారు. పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.

నల్గొండ జిల్లాకు సాగునీటి కేటాయింపులు, రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ తరఫున ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చిరుమర్తి లింగయ్య తెలిపారు.

Hot this week

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Topics

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.