దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి :-
దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో నిరుపేద, అనాథ వ్యక్తి మృతి చెందడంతో మానవతా దృక్పథంతో పలువురు ముందుకు వచ్చి అండగా నిలిచారు.
ఈ విషయం తెలుసుకున్న దమ్మపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ మానవతా దృక్పథంతో స్పందించి, ఆ నిరుపేద అనాథ వ్యక్తి అంత్యక్రియల కోసం రూ.5,000 విలువైన దహన ఖర్చులకు సహాయం అందించారు. ఆపద సమయంలో అండగా నిలిచి, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా సహకరించిన సర్పంచ్ సేవను స్థానికులు అభినందించారు.
నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుతున్న సర్పంచ్ గారి సేవలను స్థానికులు ప్రశంసించారు.


