నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.






