నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వ పాలనపై మాట్లాడారు.
ఈ సందర్భంగా వేముల గోపీనాథ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్తగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, విద్యార్థులకు క్లాస్మేట్ ఛార్జీల పెంపు, ఉద్యోగ నియామకాలు తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి రావడం లేదని వేముల గోపీనాథ్ విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై స్పందించని కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని సహా అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు.
ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని వేముల గోపీనాథ్ కోరారు


