నవపక్షం , హైదరాబాద్ :
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న మహాధర్నా, బిక్షాటన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సెరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో 248 ఆల్విన్ కాలనీ డివిజన్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు కీర్తన్ రాజ్ పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు మదీనాగూడ గాంధీ సర్కిల్ నుంచి చందానగర్ గాంధీ సర్కిల్ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా కీర్తన్ రాజ్ మాట్లాడుతూ, “ఫీజులు చెల్లించలేక విద్యార్థుల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు” అని డిమాండ్ చేశారు.
విద్యార్థుల హక్కుల కోసం నిర్వహిస్తున్న ఈ పోరాటానికి 248 ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, యువత, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


