నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 31 :
చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని వలిగొండ రోడ్డు బాలాజీ వెంచర్లో శ్రీ సంతోషిమాత ఏజెన్సీస్ (ఆర్తోస్ కూల్ డ్రింక్స్ డీలర్) నూతన షాపును స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా షాపు యజమాని సైదిరెడ్డి, కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేశారు. నూతనంగా ప్రారంభమైన ఏజెన్సీ వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ నబీబి జానీబాబు, ప్రముఖ వ్యాపారవేత్త చిలువేరు మంగయ్య, పుష్కాగుల శ్రీను, జి. చంద్రయ్య, బోరెన్ ధర్మేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, శంకర్ రెడ్డి, సలీం, సంతోష్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

