మహిళలకు ఉచిత చీరలు.. ఈసారి కొత్త డిజైన్లలో సెప్టెంబరు 20లోగా ఉత్పత్తి పూర్తి.. అక్టోబరులో పంపిణీకి సన్నాహాలు

నవపక్షం, తెలంగాణ బ్యూరో: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత చీరల ఉత్పత్తి ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈసారి కొత్త డిజైన్లతో పాటు నీలం రంగుకు బదులుగా చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మే నెలలో మొత్తం 4.62 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా, ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి పూర్తయింది. మిగిలిన ఉత్పత్తిని కూడా నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

చీరల ఉత్పత్తి కోసం ప్రభుత్వం మొత్తం రూ.450 కోట్లను కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.142 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం. సెప్టెంబరు 20లోగా చీరల ఉత్పత్తిని పూర్తిచేసి, అక్టోబర్‌లో మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూమ్‌లు, మ్యాక్స్‌ సంఘాలకు పెద్దఎత్తున పని లభిస్తోంది. దీంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో పవర్‌లూమ్‌ పరిశ్రమకు ఊతం లభించడంతో పాటు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

కొత్త రంగులు, డిజైన్లతో రూపొందుతున్న ఈ చీరలను అక్టోబర్‌లో మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Hot this week

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.