ఖమ్మం: యువత శక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు, నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, యువత హక్కులపై అవగాహన కల్పించడం, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు నిర్వహించడమే యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ అన్నారు.
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు
ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్, వేజండ్ల సాయికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదని, ప్రశ్నించడం, నిరసన వ్యక్తం చేయడం, న్యాయం కోరడం యువతకు ప్రజాస్వామ్య హక్కులని అన్నారు.
దేశంలోని యువత గొంతుకను అణచివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు. హింస, బెదిరింపులు, అణచివేత ద్వారా యువత హక్కులను కాలరాయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తగిన దృష్టి పెట్టడం లేదని వేజండ్ల సాయికుమార్ విమర్శించారు. నిరుద్యోగ నిర్మూలన, విద్యా రంగ అభివృద్ధి, సామాజిక న్యాయం, యువత హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
“బీజేపీ ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఈ దేశ యువత భయపడదు. యువత నిరంతరం ప్రశ్నిస్తుంది. యువతను భయపెట్టలేరు, అణచలేరు, ఆపలేరు” అని సాయికుమార్ అన్నారు.
యువత సమస్యలపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
300 మందికి అన్నదానం
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు కొత్త సీతారాములు, శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా జనరల్ సెక్రటరీలు కిలారు అనిల్ కుమార్, గంగరాజు, బచ్చలకూర నాగరాజు, గాదెల ఝాన్సీ, బామ్మిడి శ్రీనివాస్, రంగా జనార్ధన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షాహెల్ జావిద్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ అంజన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జం బాలగంగాధర్, బానోత్ కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే జిల్లా జనరల్ సెక్రటరీలు బెల్లంకొండ శరత్, కుక్కల మహేష్, అన్వేష్ గౌడ్, నెల్లూరి ఉపేందర్, బాలరాజ్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లం సాయి తేజ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు అంబటి ఈశ్వర్, జంగం రాజేష్, నితీష్ కుమార్, కైసర్, ఆకాష్ నాయుడు, సాయి తేజ, ఖమ్మం టౌన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, టౌన్ ఉపాధ్యక్షులు సైదన్ రావు, సంపత్ నాయుడు, మండల అధ్యక్షులు రామకృష్ణ, నిమ్మల నాగేశ్వరావు, సతీష్, ముత్తారావు, యువజన కాంగ్రెస్ నాయకులు బోడిపూడి రాజా, పంది రాజు, దేవరకొండ రాజీవ్ గాంధీ, సాయి కుమార్, తోట నరేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






