నిరుపేద కుటుంబానికి రూ.లక్ష CMRF LOC అందజేత.. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, జనగామ జిల్లా ప్రతినిధి : 

బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద మున్నూరు కాపు కుటుంబానికి చెందిన జూల లక్ష్మయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ.1,00,000 విలువైన CMRF LOC మంజూరైంది.

జూల లక్ష్మయ్య వేరికోసిల్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని డీసీసీ ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నల్ల మహేందర్ ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబ పరిస్థితిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

వారి సహకారంతో తక్షణమే రూ.1 లక్ష CMRF LOC మంజూరు చేయించడం జరిగింది. మంజూరు పత్రాన్ని పోచన్నపేట గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థుల సమక్షంలో నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బాధితుడు జూల లక్ష్మయ్యకు అందజేశారు.

ఈ సందర్భంగా నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు వైద్యం భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రజా ప్రతినిధులు, నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.

బాధిత కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి CMRF సహాయం అందేలా కృషి చేసిన నాగపురి కిరణ్ కుమార్ గౌడ్‌కు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నల్ల మహేందర్, బచ్చన్నపేట మండల ఉపాధ్యక్షులు కొయ్యడి శ్రీనివాస్, టీపీసీసీ ఎస్సీ సెల్ సెక్రటరీ జంగిటి నరేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజేందర్ రెడ్డి, సేవాదళ్ బ్లాక్ కాంగ్రెస్ లింగాల వెంకటరెడ్డి, కొడవటూర్ డైరెక్టర్ శ్రీపతి ప్రభాకర్, చిరంజీవి, ఇమ్మడి నరేష్ రెడ్డి, కొడవటూర్ మాజీ డైరెక్టర్ ఈర్ల శివరాములు, పోచన్నపేట మాజీ ఉపసర్పంచ్ జూల కిష్టయ్య, పోచన్నపేట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ ఎల్లేష్, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల ఉపేందర్ రెడ్డి, మాజీ శ్రీపతి దయాకర్, గొర్రె దేవదాస్, గట్టు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Hot this week

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహణ

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ...

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

Topics

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.