420 హామీలపై సమరభేరి.. కాంగ్రెస్ పాలనపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

నవపక్షం, చౌటుప్పల్ మండల ప్రతినిధి:

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడులో భారీ ధర్నా నిర్వహించారు.

మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వహించారు. వంద కార్లు, వందలాది బైకులు, వేలాది మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.