మేడ్చల్ రూరల్ జిల్లా BJYM ఇన్‌చార్జిగా బండి దీక్షిత్

నవపక్షం, రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 18:

భారతీయ జనతా పార్టీ యువమోర్చా (BJYM) మేడ్చల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది, యువ నాయకుడు బండి దీక్షిత్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు సూచనల మేరకు BJYM రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండె ఈ నియామకాన్ని చేపట్టారు.

విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించిన బండి దీక్షిత్ గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతూ విద్యార్థి, యువజన, సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నారు.

బీఎన్ రెడ్డి ఏరియా ఇన్‌చార్జిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, అనంతరం ఇబ్రహీంపట్నం టెక్నికల్ సెల్ జోనల్ ఇన్‌చార్జిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సమస్యలపై ఉద్యమాలు చేపట్టారు. విద్యార్థి ఉద్యమాల సందర్భంగా పలు కేసులు, గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులను ఎదుర్కొన్నారు. 2012లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ABVP పిలుపు మేరకు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని వారం రోజుల పాటు జైలు జీవితం గడిపారు.

అనంతరం BJYMలో వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడిగా, ఎల్‌బీనగర్ అసెంబ్లీ కన్వీనర్‌గా, రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషించారు.

BJYM కమిటీల నిర్మాణంలో భాగంగా గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ఇన్‌చార్జిగా పర్యటించి కమిటీల ఏర్పాటు ప్రక్రియలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జిగా సుమారు రెండేళ్లపాటు పనిచేస్తూ జిల్లా, రాష్ట్ర కమిటీల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.

అదేవిధంగా GHMC ఎన్నికలు, ఎల్‌బీనగర్ నియోజకవర్గం, బండ్లగూడ, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. నాలుగు పర్యాయాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ ఏజెంట్‌గా, సబ్ డివిజన్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో 356 మంది కొత్త ఓటర్లను నమోదు చేయించడం నుంచి, మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో పోలింగ్ బూత్‌ల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ వరకు దీక్షిత్ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై స్పందించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించడం, వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బండి దీక్షిత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో బండి దీక్షిత్‌కు మేడ్చల్ రూరల్ జిల్లా BJYM ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై బీజేపీ శ్రేణులు, యువ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో మేడ్చల్ రూరల్ జిల్లాలో BJYM సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.